SP బాలు ఆరోగ్య పరిస్థితి పై క్లారిటి ఇచ్చిన: SP చరణ్

SP బాలు గారికి నెగెటీవ్ వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయని ,తను కోలుకుంటున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి ఇంక కొంత సమయం పడుతుంది అని ఈ ఉదయం కొన్ని వార్తలు వినిపించాయి .
ఈ విషయాన్నీ బాలు గారి కుమారుడు చరణ్ స్వయంగా ప్రకటించారని, తన నాన్న ఆరోగ్యం కోసం పూజలు ,ప్రార్థనలు చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపినట్టు వచ్చిన వార్తల పై చరణ్ స్పందిస్తూ, బయట వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చరణ్ ఒక వీడియోను విడుదల చేసాడు.
మా నాన్నగారు ఇంకా క్రిటికల్ పొజిషన్ లోనే ఉన్నారని ,నాన్న ఆరోగ్యం గత 48 గం,, నుండి స్టేబుల్గా ఉందని, తన ఆరోగ్య పరిస్థితి గురించి తనకే ముందుగా డాక్టర్ నుండి సమాచారం వస్తుందని ,దయచేసి ప్రజలు,నాన్నగారి అభిమానులు బయటవస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ,నాన్న ఆరోగ్య పరిస్థితికి సంబదించిన సమాచారాన్ని తానే స్వయంగా మీడియా ద్వారా తెలియజేస్తానని చరణ్ వెల్లడించారు .