News

Sourav Ganguly: మరో సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న గంగూలీ … ఎలాంటి ప్రమాదం లేదన్న డాక్టర్లు !

Sourav Ganguly Health Update

Sourav Ganguly Health Update: బీసీసీఐ అధ్యక్షుడు మరోసారి హాస్పిటల్ కి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు స్పందిస్తూ అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని మీడియాకు తెలిపారు.

అలాగే ప్రజలు గంగూలీ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన పడొద్దని ఆస్పత్రి వర్గాలు  వెల్లడించారు. అదేవిదంగా  గంగూలీ ఈసీజీ రిపోర్టుల్లో చిన్న మార్పులు వచ్చాయి ఐన వాటితో పెద్ద ఇబ్బందిలేదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల దాదా కి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన విషయం అందరికి  తెలిసిందే.

అలా యాంజియోప్లాస్టీ చేసిన తరవాత దాదా పూర్తిగా కోలుకుని గంగూలీ జనవరి 7వ తేదీన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‌

 ఇక బుధవారం రాత్రి వైద్యులు రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం రెండో స్టెంటు వేసే అవకాశాలు లేకపోలేదు.

Read  ఇంట్లో నుండి యువతీ పరీక్ష ప్యాడ్ తో వెళ్లి...పసుపుతాడుతో వచ్చింది..తరువాత... !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button