Tollywood news in telugu

Soundarya : సౌందర్య ఎక్స్పోజింగ్ అందుకనే చేయలేదట : నటి ఆమని

Soundarya

Soundarya : అతిలోక సుందరిలా ఉండే హీరోయిన్ , అందాన్ని దాచుకొని అభినయాన్ని మాత్రమే కనబరిచే నటి దివంగత సౌందర్య. నిజానికి సౌందర్య బౌతికంగా దూరం అయినా అందరి మనసులో మాత్రం నిలిచిపోయింది. తన నటనతో  అభినవ సావిత్రి అనే బిరుదును కూడా  సొంతం చేసుకున్నారు. కానీ అనుకోని ప్రమాదంలో 31 సంవత్సరాలలోనే లోకం విడిచి వెళ్ళిపోయింది.  సౌందర్య మరణించి ఇప్పటికి 17 సంవత్సరాలు గడచినా తన అభిమానులు మాత్రం మరచిపోలేక పోతున్నారు.  తాను  100కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి  తానేంటో నిరూపించుకున్నారు.

సౌందర్య తాను చేసిన సినిమాల ద్వారా 100 కోట్ల ఆస్తులు సంపాదించిందని ఇంతకముందు  తన కుటుంబసభ్యులు తెలిపారు. అదికూడా గ్లామర్ షో లు చేయకుండానే ఆ మొత్తాన్ని కూడబెట్టింది. సౌందర్య కు అప్పట్లో పోటీగా రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్ర హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ అవకాశాలు దక్కించుకుంటే  ,  సౌందర్య మాత్రం ఏ సినిమాలో కూడా హద్దులు మీరలేదు. ఇలా హద్దులు దాటకుండా ఇమేజ్ తెచ్చుకోవడం అంటే అది ఒక సౌందర్యకు మాత్రమే చెల్లిందని చెప్పాలి.

ఆ కాలంలో సినిమా  ఇండస్ట్రీలో సౌందర్యకు స్నేహితులు చాల  తక్కువే. ఇక హీరోల విషయానికి వస్తే  జగపతిబాబు, శ్రీకాంత్.. హీరోయిన్లలో ఆమనితో ఎక్కువగా తన విషయాలను షేర్ చేసుకొనేది .  తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటించిన ఆమని ఒక .. యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇంచింది. ఇందులో  సౌందర్య గురించి టాపిక్ వచ్చినపుడు , సౌందర్య గురించి కొన్ని ఇంట్రెసింగ్ విషయం చెప్పింది. అందరు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేసే .  సౌందర్య మాత్రం ఆలా ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చింది.

ఆమని మాట్లాడుతూ సౌందర్య దగ్గర కూర్చున్నపుడు .. ఒక సారి  ఎక్స్‌పోజింగ్ గురించి అడిగానని చెప్పింది . దానికి వెంటనే.. ఎందుకే ఎక్స్‌పోజ్ చేయాలి.. రేపు పెళ్లై భర్త  తో కలిసి తన  సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది..అలాగే  మన ఫ్యామిలీతో కలిసి , రేపు పిల్లలతో కలిసి తన మూవీ  చూస్తే  ఒకసారి ఎలాఉంటదో ఆలోచించు అని చెప్పిందట.  అందుకే తన కెరీర్‌లో సౌందర్య ఎప్పుడూ అవకాశలకోసం  ఎక్స్‌పోజింగ్ చేయలేదని ఆమనీ  చెప్పుకొచ్చింది . అందుకనే సౌందర్యకు ఎనలేమి క్రేజ్ వచ్చింది. అలాగే సావిత్రి అనే గుర్తింపుకూడా లభించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button