Soundarya Biopic is Rashmika Dream : సౌందర్య బయోపిక్ చేయాలన్నది చిరకాల కోరిక : రష్మిక :-

Is Rashmika Dream Soundarya Biopic? : రష్మిక మండన వరుస తెలుగు , తమిళ , కన్నడ సినిమాలతో లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది.
అయితే రష్మిక పుట్టింది, పెరిగింది మాత్రం కర్ణాటక. కర్ణాటకలోనే తన బాల్యం గడిపేసింది. రష్మిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది కూడా కన్నడ సినిమా ద్వారానే. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించింది అంటే బాషా రాని వారు కూడా ఈ సినిమాని చూసేసారు. ఆలా రష్మిక ఓవర్ నైట్ స్టార్ అయింది.
ఈ సినిమా తోనే వరుసగా తెలుగు లో ఆఫర్స్ రావడం మొదలయ్యి. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే.
అయితే ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప సినిమా లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మీడియా ఇంటరాక్షన్ జరిపారు. ఇందులో భాగంగా రష్మిక తన మనుసులో ఉన్న కోరికను బయటపెట్టేసింది.
అదేంటంటే సౌందర్య గారి బయోపిక్ తీయాలని , చిన్నపటినుంచి ఉన్న ఏకైక కోరిక అని చెప్పకనే చెప్పేసింది. రష్మిక వాళ్ళ నాన్న కూడా రష్మికను చిన్నపటినుంచి సౌందర్య ఫీచర్స్ తనలో ఉన్నాయని చెప్తునే వచ్చారని , ఆలా, ఆలా ఆ మాటలు కాస్త నా చిరకాల కోరికగా మిగిలిపోయిందని రష్మిక చెప్పారు.
రష్మిక కోరిక త్వరగా నెరవేరాలని కోరుకుందాం. సౌందర్య గారి బయోపిక్ చూడాలని ఎవరికీ ఉండదు. చూడాలి మరి రష్మిక కోరికను ఎవరు తీర్చడానికి ముందుకు వస్తారో..