Tollywood news in telugu

South Indian Heroine : మరో సావిత్రిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ గుర్తు పట్టండి చూద్దాం..!

South Indian Heroine :  మరణించిన గాని నవ్వించే అవకాశం కేవలం కళాకారులకే దక్కుతుంది. అది వెండితెర కావచ్చు… బుల్లితెర కావచ్చు. పైన ఫోటో లో కనిపిస్తున్న చిన్న పాప ఇపుడు మన మధ్య లేదు. 32 ఏళ్ళ వరకు ప్రేక్షకుల ఆదరణ పొంది ఇపుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఇంకా ఎదిగే క్రమం లోనే ఒక హెలికాఫ్టర్ దుర్ఘటనలో చనిపోయింది.

డాక్టర్ చదివి ప్రజలకు సేవలందించాల్సిన ఒక  అమ్మాయి అనుకోకుండా వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని. అలాగే  తాను నటించిన సినిమాలతో పాత్రలతో హోమ్లీ హీరోయిన్ గా మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. పెళ్ళైన కొన్నిరోజులకే  ఆమె మరణించి, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.  అభినవ సావిత్రగా పేరు పొందిన ఆ నటి మరెవరో కాదు  తెలుగు హీరోయిన్ సౌందర్య.

Soundarya biography

సౌందర్య తండ్రి వృత్తిరీత్యా జ్యోతిష్కులు.. చిన్నతనంలోనే తన కూతురు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని తనకు తెలుసునని  కన్నడ ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ అదే నిజమై , సౌందర్య మనకు దూరం అయ్యారు.  తెలుగులో సౌందర్య మనవరాలి పెళ్లి మూవీ తో వెండి తెరకు పరిచమయ్యారు.  రాంజేంద్రు, గజేంద్రుడు సినిమాతో హిట్ అందుకోవడమే కాదు.. కెరీర్ మలుపు తిరిగింది.  అమ్మోరు, పెదరాయుడు . నరసింహ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలలో నటించి బిజిగా మారిపోయారు.

అప్పటికే గ్లామర్ హీరోయిన్లు వస్తున్నప్పటికీ , చక్కని  కట్టుబొట్టు నిండైన దుస్తులతో స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినీ రంగాన్ని ఏలారు.  కేవలం 32 ఏళ్ల వయసులోనే ఒక రాజకీయ పార్టీ పిలుపుమేరకు కరీంనగర్ బయలుదేరేసమయంలో హెలికాపర్ కుప్పకూలడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సౌందర్య.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button