technology information

ఇండియాలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన సోనీ కంపెనీ

 

 

జపాన్ దేశానికి చెందిన మొబైల్ తయారీదారి సోనీ కంపెనీ తన సోనీ Xperia XZ2 స్మార్ట్ ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేసి Xperia రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటుంది. దీని ధర కేవలం 72,990 రూపాయలు. సోనీ కంపెనీ అందించిన స్మార్ట్ ఫోన్స్ లో ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్. లాంచింగ్ అయినప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా అంతటా సెలెక్ట్ చేసిన సోనీ సెంటర్ లలోని సెలెక్టెడ్ మొబైల్ స్టోర్స్ లో ఆగస్టు 1 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ సంస్థ యొక్క ఈ న్యూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 4K HDR మూవీ రికార్డింగ్ ఫీచర్ ని కలిగి ఉంది. కేవలం ఈ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే లిక్విడ్ బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇండియాలో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్స్ :

సోనీ Xperia XZ2 స్మార్ట్ ఫోన్ 1080×2160 రిజల్యూషన్ తో 5.7-అంగుళాల పూర్తి HD + TRILUMINOS  స్క్రీన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. స్క్రీన్ 18: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంటుంది. ఈ డివైస్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క కోటింగ్ తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ డ్యూయల్ స్లిమ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 845 ప్రాసెసర్ తో పవర్ చేయబడింది మరియు ఆండ్రాయిడ్ ఓరీయో ఆపరేటింగ్ సిస్టంతో రన్ అవుతుంది. సోనీ ఎక్స్పీరియా XZ2 6GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడింది. మైక్రో SD సపోర్ట్ తో 400GB వరకు స్టోరేజ్ ని ఎక్సపాండ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ ముందు వైపు ఒక 1 / 2.3 అంగుళాల Exmor RS సెన్సార్ మరియు 25mm వెడల్పు సోనీ G లెన్స్ తో ఒక 19MP మోషన్ ఐ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. కెమెరా మోషన్ తో ప్రిడిక్టివ్ కాప్చర్ , స్మైల్ డిటెక్షన్, ఆటోఫోకస్ మరియు ప్రిడిక్టివ్ ఆటోఫోకస్ వంటి వంటి లక్షణాలను కలిగి ఉంది. అదనంగా XZ2 పూర్తి HD వీడియో రికార్డింగ్ సామర్థ్యాలలో 960fps సూపర్ స్లో మోషన్ ఉన్నాయి. సెల్ఫీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 5-యాక్సిస్ స్టెబిలిజేషన్ మరియు 3D  సెల్ఫీ కాప్చరింగ్ తో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

సౌండ్ కోసం, Xperia XZ2 S- ఫోర్స్ ఫ్రంట్ సరౌండ్ తో ఫ్రంట్ పేసింగ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కొత్తగా లాంచ్ చేసిన  ఈ హ్యాండ్ సెట్ లో ఆడియో డేటాను విశ్లేషించడానికి డైనమిక్ వైబ్రేషన్ సిస్టమ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ARCore మరియు Google లెన్స్ మరియు మరిన్ని ఫీచర్స్ వినియోగదారులకు నిజమైన వాస్తవిక అనుభవాన్ని కలిగిస్తాయి. 3.5 mm ఆడియో జాక్ మరియు సిం ట్రే డివైస్ పై భాగాన అంచులో ఉంటుంది.

అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే USB –C పోర్ట్ కింద వైపు అంచులో ఉంటుంది. Bluetooth 5.0 వైర్లెస్ టెక్నాలజీ, USB 3.1 Gen1, VoLTE (4G), GSM GPRS / EDGE (2G), UMTS HSPA + (3G), వైఫై మరియు GPS. సోనీ Xperia XZ2 లో ఒక 3,180 mAh బ్యాటరీ క్వాల్కం క్విక్ ఛార్జ్ 3.0  టెక్నాలజీతో సపోర్ట్ చేస్తుంది, మరియు లో ఛార్జింగ్ ఉన్నప్పుడు మరియు ఛార్జ్ చేయడానికి అవకాశo లేనప్పుడు స్మార్ట్ స్టామిన మోడ్ ఉంటుంది. డివైస్ వెయిట్ 198 గ్రాములు మరియు డైమెన్షన్స్ 153 x 72 x 11.1 మిమీ. ఈ స్మార్ట్ ఫోన్ IP65/IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ కూడా.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button