sonu sood music video : ఆర్మీ ఆఫీసర్ గా మారిన రియల్ హీరో సోనుసూద్ !

Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో ఎలాటి హీరోయిజమ్ చుపించాడో అందరికి తెలిసిన విషయమే, పేదలు వారి స్వస్థలాలకు వీళ్ళడానికి కష్టపడుతున్న టైం లో సోను చేసిన సహాయం మేలు పొందినవాళ్లు, చూసినవాళ్లు లైఫ్ లో కూడా మరచిపోరు. అదేవిదంగా సోనుకి అప్పటినుండి ఇప్పటివరకు ప్రజలు ప్రసంశలు కురిపిస్తూనేవున్నారు.
ఇప్పటివరకు సోను చేసిన సహాయానికి ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. తాను చేసిన సహాయానికి ఇండస్ట్రీ గౌరవించి సినిమాలో ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. సోను ప్రస్తుతం వరుసగా ఇటు తెలుగులోను అటు హిందీలో సినిమాలు చేస్తూ ఎంతో బిజిగా ఉన్నారు.
తాజాగా తొలిసారి సోనూసూద్ ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించారు . సింగర్ సునంద శర్మతో కలిసి ‘పాగల్ నహీ హోనా’ మ్యూజిక్ వీడియోలో నటించాడు . ఈ రోజు వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియో అద్భుతమైన లిరిక్స్ తో కూడిన ఒక రొమాంటిక్ వీడియో కాగా ఇందులో సోనూసూద్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఈ సాంగ్ లో సోనూని ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిగా సింగర్ సునంద శర్మ నటించారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.