Sonu Sood : దేశం మారడానికి చక్కని సూత్రం చెప్పిన సోనూసూద్

Sonu Sood కరోనా కష్టకాలంలో ఎంతో మంది ప్రజలను ఆదుకొని, భారతదేశ ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిన వ్యక్తి సోనూసూద్. దేశంలో ఏ మూలన కష్టం వచ్చిన షోషల్ మీడియా ద్వారా, తన వ్యక్తిగత పరిచయస్తుల ద్వారా వారి కష్టాలను తెలుసుకొని, వారికీ దేవుడిలా సహాయాన్ని అందించి దేశ ప్రజలతో సోనూసూద్ హీరో అనిపించుకున్నాడు.
సినిమాలో విలన్ పాత్రలు వేస్తూ, నిజ జీవితంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సోనూసూద్.
ఇటీవల ‘అల్లుడు అదుర్స్ ‘ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ ని చిత్ర యూనిట్ ఘనంగా సత్కరించింది.
సోనూసూద్ మాట్లాడుతూ తనతో పాటు, తన కుటుంబ సబ్యులకు సహాయాన్ని కోరుతూ మెయిల్స్ వచ్చేవని, అందులో ఎవరికి అయితే అత్యవసర సహాయం అవసరం ఉంటుందో వారిని గుర్తించి, వారికి సహాయం చేసే వాడినని, అయితే ఈ సహాయం వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, కేవలం సాటి మనిషికి సహాయం చేయాలనే తపన ఉండేదని వెల్లడించారు.
ప్రతి మనిషి సాటి మనిషి కష్టాల్లో ఉన్నపుడు సహాయ పడితే ఈ దేశం ఎంతగానో మారిపోతుందని సోనూసూద్ తెలిపారు.