Today Telugu News Updates

అన్నదాతల విషయం లో ఆవేదన వ్యక్తం చేసిన సోనూసూద్ !

sonusood latest

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల  ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. గతం లో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులను  నష్టపరిచేవిదంగా ఉన్నాయని వాటిని  రద్దు చేయాలనీ రైతు సంఘాలు నిరసనను తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ  శనివారంతో రైతుల ఆందోళన 24వ రోజుకు చేరుకోవడంతో  నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఈ ఆందోళనలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే విషయం పక్కన పెడితే , నాకు రైతులతో మంచి అనుబంధం ఉంది. ప్రభుత్వం రైతుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తుందని  కోరుకుంటున్నాను.

రైతులు ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని లేదంటే వారి కుటుంబసభ్యులు రోడ్డున పడతారని తెలిపాడు. ఇలా చలికి  వణుకుతూ..కుటుంబంతో సహా రోడ్ల పైన ఉండడం చుస్తే బాదేస్తుందని వెల్లడించాడు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button