Tollywood news in telugu
Sonu Sood: సోనూ సూద్ నేరం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు
కరోనా కష్టకాలంలో పేదలను ఆర్థికంగా.. విద్యార్థులకు అండగా నటుడు సోనూసూద్ నిలిచాడు. తాను చేసిన సహాయం చూసి ప్రజలు సోనూసూద్ ని దేవుడు గా భావిస్తున్నారు

మహారాష్ట్రలోని ముంబై జుహులోని ఆరు అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా నటుడు సోనూసూద్ హోటల్ గా మార్చారని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి ) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ (ఎంఆర్‌టీపీ) చట్టం ప్రకారం అనుమతి లేకుండా హోటల్ గా మార్చడం నేరమన్ని, సోను సూద్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బిఎంసి కోరింది.

ఈ విషయంపై సోను సూద్ స్పందించారు. ఆ భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, అలాగే ఎంసీజెడ్‌ఎంఏ కరోనా కారణంగా ఇంకా రాలేదని తెలిపారు. కరోనా యోధుల కోసం భవనాన్ని హోటల్ గా మార్చామన్నారు. ఒకవేళ పర్మిషన్స్ రాకపోతే తిరిగి నివాసంగా మారుస్తామని సోను సూద్ తెలిపారు