Tollywood news in telugu
Sonu Sood: జవాన్లకే అంకితం అంటూ …మరోసారి తన ఔదార్యాని చాటుకున్నా సోను సూద్

సోనూసూద్… ఈయన చేసే ది విలన్ రోల్ లు అయినా… ప్రేక్షకుల గుండెల్లో రియల్ హీరోగా స్థానం సంపాదించుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు, విద్యార్థులకు సోను సూద్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు చిత్రంలో విలన్ గా నటించారు. ఆ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కూడా సోనూసూద్ నటిస్తున్నారు.

అదేవిధంగా సోనుసూద్ ఇటీవలే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ లో నటించాడు. ‘పాగల్ నహీ హోనా” అనే ఈ సాంగ్ ను సింగర్ సునందా శర్మ పాడారు. అలాగే ఈ వీడియో సాంగ్ లో సోను సూద్ ఆర్మీ అధికారి గా నటించాడు.
ఈ వీడియో సాంగ్ ని జనవరి 15న విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో సాంగ్ ని భారత జవాన్లకు వారి సతీమణి లకు అంకితమిస్తున్నట్లు సోను సూద్ తెలిపారు