తండ్రి చివరి వింత కోరిక … తన అస్థికలను బీరులో కలిపి.. ఏంచేయమన్నాడంటే…!

son pours father’s ashes in drain outside pub : ఏ తండ్రి అయినా తాను చనిపోయాక తన అస్థికలను పవిత్రమైన నదుల్లో కలపమని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి బీరులో కలిపి డ్రైనేజి లో పోయామని కోరాడు. ఇది విన్న కొడుకు ఆశ్చర్యానికి లోనయ్యాడు. కానీ ఏంచేస్తాడు. తండ్రి చివరికోరిక కాబట్టి తీర్చలేక తప్పలేదు.

విషయానికి వెళ్తే…. లండన్ లో కోవెంట్రీకి చెందిన ‘కెవిన్ మెక్‌గ్లించే’ అనే వ్యక్తి చనిపోక ముందు వింత కోరిక కోరాడు. తాను మరణించిన తర్వాత ఆస్థికలను తనకు ఎంతగానో ఇష్టపడే ‘హోలీబుష్ పబ్’ కు తీసుకెళ్ళి … ఆ పబ్ లో ఉన్న బీరులో కలిపి .. పబ్ ముందున్న డ్రైనేజీలో కలపాలని కోరాడు.

కొన్ని రోజుల తరువాత ‘కెవిన్’ చనిపోయాడు. తండ్రి కోరికమేరకు కెవిన్ అస్థికలను అతని కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి తండ్రి చెప్పిన హోలీబుష్ పబ్‌కు తీసుకెళ్ళి , అక్కడి బీరులో అస్థికలను కలిపి…. అటు పిమ్మట బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలిపేశారు. కొడుకు పైకి చూస్తూ.. ‘నాన్నా..నువ్వు చెప్పినట్లే చేశాం..సంతోషమేనా అని అడిగాడు. తన తండ్రి కోరిక విచిత్రంగా ఉన్నా కానీ ఆయన కోరిన కోరిక తీరిస్తే ఆయన ఎప్పుడు మాతోనే ఉంటారనే నమ్మకం తో ఇలా చేశామని బదులిచ్చాడు.