Sneha Ullaal Re-entry in Tollywood is Fixed : 8 ఏళ్ళ తర్వాత మరల టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్ :-

Sneha Ullaal Re-entry in Tollywood is Fixed : అపుడెపుడో 2013 లో అల్లరి నరేష్ , వైభవ్ , రాజ్ సుందరం కలిసి నటించిన ౩డి సినిమా యాక్షన్ 3D. ఆ సినిమా లో చివరిగా కనిపించి అలరించిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
కాకపోతే స్నేహ ఉల్లాల్ అంటే ప్రేక్షకులకు , కుర్రగారికి ఇప్పటికి ఇష్టమే. దానికి గల కారణం తాను నటించిన కరెంట్ , ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలు. ఈ రెండు సినిమాలో తన నటనకి ఇప్పటికి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలోని ధనలక్ష్మి పాత్ర. జీవితాంతం గుర్తుండిపోయేలా నటించేసింది.
అలాంటి స్నేహ ఉల్లాల్ యాక్షన్ ౩డి సినిమా తర్వాత ఇప్పటిదాకా ఎటువంటి సినిమా చేయకుండా, ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక సినిమా కూడా చేయకుండా ఉండిపోయింది. ఇన్నేళ్ళు టాలీవుడ్ లో సినిమా చేయకుండా ఉండటానికి గల కారణాలు ఏంటో ఇప్పటికి తెలియదు.
అయితే ఇన్నెళ్ళకు స్నేహ ఉల్లాల్ మరల తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈసారి హీరోయిన్ గా కాకుండా ముఖ్యమైన పాత్ర చేయబోతోందని తెలిసింది.
మ్యాటర్ లోకి వెళ్తే సప్తగిరి హీరోగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కించే మల్టీ లింగువల్ సినిమా ఎయిట్ (8) , ఈ సినిమా సప్తగిరి కెరీర్ లోని భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో స్నేహ ముఖ్యమైన పాత్ర చేయబోతోందని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
స్నేహ పాత్ర ఈ థ్రిల్లర్ సినిమాలో చాల కొత్తగా డిజైన్ చేశారని పోస్టర్ చూడగానే అర్ధం అవుతుంది. ఏదేమైనా ఇన్నేళ్లకు స్నేహ ఉల్లాల్ మరల తెలుగు సినిమా చేయడం తో తన అభిమానులు , ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ వారి ఆనందాన్ని స్నేహని ట్యాగ్ చేస్తూ వ్యక్తపరుస్తున్నారు.
చూడాలి మరి స్నేహ కం బ్యాక్ సినిమా లో ఎలా ఉండబోతుందో. ఎలాంటి డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందో వేచి చూడాలి.