Viral news in telugu

ప్రియురాలు మోసం చేస్తోందని పసిగట్టి … ఎంతపని చేసాడో చుడండి…!

 girlfriend is cheating

ఎంతోకాలంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న యువతిని అడ్డగించి ప్రేమకే కళంకం తీసుకొచ్చాడు ఒక ప్రబుద్దుడు.  తనతో కాకుండా మరో యువకునితో కలిసి తిరుగుతుందని గ్రహించి. తన మిత్రులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే… బెంగళూరుకు చెందిన జాకీర్ హుస్సేన్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయి మరొక వ్యక్తితో స్నేహం చేసి అతనితో తిరుగుతుంది. ఈ విషయాన్నీ జాకిర్ పసిగట్టాడు. ఎలాగైనా వారిద్దరిని దూరం చేయాలనీ అనుకున్నాడు.

ఇక ఆ యువతిని ఎలాగైనా దెబ్బకొట్టాలి , అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దీనికై తన స్నేహితుల సహాయాన్ని తీసుకున్నాడు. వారు కూడా ఒప్పుకోవడంతో ప్లాన్ ని పకట్ బందీ గా అమలుచేశారు. జాకీర్ ప్రేమించిన యువతి, ఒక రోజు ఒంటరిగా రోడ్డుపై  వెళుతుండగా, జాకీర్ స్నేహితులు షాబాజ్ ఖాన్, ఫాజిల్ కలసి ఆమెను అడ్డగించి, ఆమె వద్ద ఉన్న 102 గ్రాముల బంగారు నగలను దోచుకుని పారిపోయారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుంది. ఆ యువతి వెంటనే పోలీసులకు  ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిరోజులకు నిందితులు దొరకడంతో  దీనంతటికి కారణం జాకీర్ అని తెలిసిపోయింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button