Tollywood news in telugu

Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది… మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా…!

Uppen Krithi Shetti : కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో తన నటన, సొట్టబుగ్గల చిరునవ్వుతో ప్రేక్షకులను, అందులో ముక్యంగా  యువకుల మనసును దోచేసింది. ఇటీవల ఉప్పెన మూవీ ఘనవిజయం సాధించడంతో బెబమ్మ కి వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

గతంలో టీవీ యాడ్స్ లో నటించి ఒక హీరోయిన్ గా ఇపుడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటె తాజాగా షోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో కొన్ని విషయాలను షేర్ చేసుకుంది కృతిశెట్టి. అందులో ఒక అభిమాని మీకు ఏమి కోరికలు ఉన్నాయి అని అడగగా … దీన్నికి సమాధానంగా కృతిశెట్టి … తనకి తన సినిమాలో తానే సొంతగా డబ్బింగ్  చెప్పాలని ఉందని. ఈ కోరికను ఒప్పుకొని నాచేత డబ్బింగ్ చెప్పించేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానని తెలిపింది. అలాగే తన మొదటి సినిమా ఉప్పెన ను హిట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది.

మరి కృతిశెట్టి తన సినిమాకి డబ్బింగ్ ఏ సినిమాతో మొదలుపెడుతుందో , ఏ దర్శకుడు  ఆ అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే . Uppen Krithi Shetti ఇక కృతి శెట్టి  నటిస్తున్న సినిమా విషయాలకు వస్తే.. నాని హీరోగా నటిస్తున్న “శ్యామ్ సింగ్ రాయ్ ” లో అదే విదంగా .. సుదీర్ బాబు నటిస్తున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” అనే మూవీలో నటిస్తుంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button