Slum Dog Husband Telugu Movie Review : కుక్కతో సినిమా తీశాడు.. బేబీ మూవీ కంటే బాగుందా?
Slum Dog Husband Telugu Movie Review:
టైటిల్: స్లమ్ డాగ్ హస్బెండ్
రచన దర్శకత్వం : ఏ.ఆర్.శ్రీధర్
నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మనకొండ, బ్రహ్మాజీ, ఆలీ, సప్తగిరి తదితర నటులు
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: అప్పి రెడ్డి,వెంకట్ అన్నపరెడ్డి
విడుదల తేదీ : 29 July 2023
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ రావు పిట్ట కథ సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించారు.

ఈ సినిమా మొత్తం పెళ్లి చుట్టే తిరుగుతుంది. సంజయ్ రావు ప్రణవి ప్రేమించుకుంటారు. అయితే సంజయ్ జాతకంలో దోషము ఉండడంతో… మొదట కుక్కతో పెళ్లి చేసుకోవాలని పురోహితులు చెప్తారు. దీంతో అతను కుక్కను పెళ్లి చేసుకున్న తర్వాత.. కుక్కతో ఎలా విడాకులు తీసుకుంటాడు… తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాడా? లేదా ? అనేదే మిగతా కథ.. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంటర్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆలీ సప్తగిరి బ్రహ్మాజీ వంటి వారు అద్భుతంగా కామెడీని పండించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రణవి మొదట సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన.. తాజాగా సినిమాలో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. డైరెక్టర్ శ్రీధర్ ఈ చిత్రాన్ని బాగానే తెరకెక్కించాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా రన్ అయినా.. సెకండాఫ్ మాత్రం ట్విస్టులతో ఫన్నీగా ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుండు అని అనిపించింది.