పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
అందమైన చర్మంపై బఠాని గింజ పరిమాణంలో వేలాడుతూ కనిపించే పులిపిర్లు మనలో చాలా మందిలో కనిపిస్తుంటాయి. వీటివల్ల మనకు ఏ ఇబ్బంది లేకపోయినా పదిమందిలో ఉన్నప్పుడు మాత్రం చూడడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ పులిపిర్లు హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ వల్ల వస్తాయి. ఇప్పుడు పులిపిర్లును మాయం చేసే విషయానికొస్తే..
సాలిసిలిక్ యాసిడ్ ఇది స్టిక్కర్ల రూపంలోనూ లిక్విడ్ రూపంలోనూ ఉంటుంది. వారానికి రెండు మూడు సార్లు పులిపిర్లు ఉన్నచోట అప్లై చేయడం వల్ల వీటిని తగ్గించవచ్చు.

ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకుని దానిని కొబ్బరి నూనెతో కలిపి దూది లేదా కాటన్ బడ్‌తో ఈ ద్రవాన్ని పులిపిరిపై రాయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు వారం రోజులపాటు చేయడం వల్ల పూర్తిగా రాలిపోతాయి.
వెల్లుల్లిని కూడా ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాయడం వల్ల అవి మాయమవుతాయి. ఇందులోని ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బాక్టీరియాలతో పోరాడుతుంది.