Tollywood news in telugu

Sithara: ఆ వెబ్ సిరీస్ కి అంబాసిడర్ గా మహేష్ బాబు కూతురు

భారత్ అనే నేను,మహర్షి ,సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..తన చిన్నారి కూతురిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికీ ఈ చిన్నారి సితార ఆడియో ఫంక్షన్ లో ,ఇంటర్వ్యూలలో తన ముద్దు ముద్దు మాటలతో అందరిని కవించింది.

అలాగే సితార ఓ వెబ్ సిరీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతుంది. “ఫంటాస్టిక్‌” అనే వెబ్ సిరీస్ ని
3డీ యానిమేషన్‌ నిర్మిస్తున్న సందర్భంగా.. దానికి సీతార ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. నిన్న హైదరాబాదులోని ఓ హోటల్ లో జరిగిన పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ , మహేష్ బాబు సతీమణి హీరోయిన్ నమ్రత తో పాటు సితార కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి సీతార మాట్లాడుతూ తనను వెబ్ సిరీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం చాలా ఆనందంగా ఉందని”అన్నారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button