మతి మరుపు వల్ల ఇంట్లో వారితో అటు బయటివారితో మాటలు పడుతున్నారా….ఇక ఈ చిన్న చిట్కాలు పాటించి వారు అనేమాటలకు ఇలా పులిస్టాప్ పెట్టండి.

ఈ ప్రపంచంలోని ఉరుకుల, పరుగుల జీవితంలో ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలన్న సాధ్యంకాని పరిస్థితిలోకి వెళ్లిపోయాం. ఆఫీస్ కి టిఫిన్ బాక్స్ లేదా ఐడి కార్డు మరచిపోవడమో, ఇంటికి వెళ్ళేటపుడు ఇంట్లోవాళ్ళు చెప్పిన వస్తువులు మరచిపోయి తీసుకెళ్లకపోవడం , వారితో చివాట్లు తినడం ప్రతివారి జీవితంలో జరుగుతూనే ఉంటుంది.
ఈ మరచిపోయే అలవాటు పెద్దవారిలోనే ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ ఇపుడు చిన్నా , పెద్దా తేడాలేకుండా ప్రతీ ఒక్కరు ఎప్పుడూ ఏదోఒకటి మరచిపోతూనే ఉంటున్నారు. మరి ఇదేమైనా జబ్బా లేదా ఇంట్రెస్ట్ లేకపోవడమా అంటే అదీ కాదు. దీనికి పరిస్కారం ఉందా అంటే, ఉంది అని చెప్పాలి. అదెలాగో తెలుసుకోండి.
1. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే లేచి యోగ , వ్యాయామాలు చేయడం. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం, అలాగే ఇష్టమైన ఆక్టివిటీలో పాల్గొనడం చేయాలి.
2. మెదడును ఉతేజపరిచే కొత్త ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మనసు తృప్తి చెందడం తో పాటు మెదడు పనితీరు చురుకుగా తయారవుతుంది.
3. మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, అలాగే మెదడుకు కూడా అంతే అవసరం అవుతుంది. దీనికోసం చిన్న విషయాలను మొబైల్ లో రిమైండర్, కాలిక్యులేటర్ లు ఉపయోగించకుండా మెదడుకు పని చెప్పాలి.
4. మన దగ్గరి బంధువులది, స్నేహితులది ఫోన్ నంబర్లు, పుట్టిన రోజులు గుర్తుంచుకోవాలి . వీటిని గుర్తుంచుకొని విషెష్ తెలపడం వల్ల బంధాలు బలపడతంతో పాటు, మెదడు గుర్తుంచుకొనే శక్తి కూడా మెరుగవుతుంది.
5. చిన్న,చిన్న విషయాలకు ఆందోళన, దిగులు పడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొనే ప్రయత్నం చేయాలి. వీటిని అధికమించడానికి కుటుంబ సభ్యులతోగాని , స్నేహితులతో గాని స్పెండ్ చేయాలి.
6. ఇక అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే మొబైల్స్ ని కంప్యూటర్ ని అతిగా వాడటం మానేయాలి.
7. పైన చెప్పిన విషయాలను మీరు తూచాతప్పకుండా పాటించినట్లయితే ఎవరి వల్ల మాట పడటం, అవమాన పడటం జరగదు.