Simha Koduri Turned as Thief : దొంగగా మారిన కీరవాణి కొడుకు ? :-

Simha Koduri Turned as Thief : హెడ్ లైన్ చూసి షాక్ అయ్యారా. కంగారు పడకండి. కీరవాణి కొడుకు ఎవరో మీకు తెలుసు కదా, సింహ కోడూరి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో. రెండవ సినిమా అనుకున్నంత హిట్ కాలేదని ఇపుడు దొంగ గెట్ అప్ వేశారు.
మ్యాటర్ లోకి వస్తే సింహ కోడూరి మూడవ సినిమా షూటింగ్ మొదలయింది. ఆ సినిమాకి సంబందించిన ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. సినిమా టైటిల్ దొంగలున్నారు జాగ్రత్త. ఇపుడు మీకు అర్ధం అయ్యింటది.
సింహ కోడూరి ప్రస్తుతం తీస్తున్న సినిమాలో దొంగగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రోమో చూడగానే అందరికి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో సింహ కోడూరి పక్కన ప్రీతి ఆస్రాని నటించగా, ముఖ్య పాత్రలో సముథిరాకాని నటించబోతున్నారు.
ఈ సినిమాని డెబ్యూ డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహించబోతున్నారు. ప్రోమో తోనే అందరిని అలరించిన ఈ చిత్ర బృందం సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని విధాలుగా అలరిస్తుందో చూడాలి మరి. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని లవర్స్ డే రోజు ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.