Chicken: చికెన్ తినే వాళ్లు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. కొంతమంది చికెన్‌ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. మరికొంతమందికి ఈ పదమే ఎమోషన్. అయితే చికెన్ తినడం మంచిదే కానీ రోజూ తినడం మాత్రం ప్రమాదమే. వారానికి 2 లేదా 3 సార్లు చికెన్ తినొచ్చు గానీ.. రోజూ మాత్రం తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చికెన్ రోజూ తింటే ఏమవుతుందో చూద్దాం.

చికెన్ ఎక్కువగా తినేవారు సాధారణంగానే బరువు పెరుగుతారు. క్రమంగా రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగి హార్ట్ ఎటాక్ సహా గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చికెన్‌ను వీలైనంత ఎక్కువసేపు ఉడికించి తినాలి. చికెన్‌లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కరోనా లాగే ప్రమాదకరమైనది.
కోళ్లు త్వరగాపెరగడానికి, బలిష్టంగా అవ్వడానికి వాటికి యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తారు. అవి మనుషులకు విషపూరితమైనవి. అందువల్ల చికెన్ ఎక్కువగా తింటే విషాన్ని కూడా మనం తింటున్నట్లే.