నైట్‌షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నారా..? అయితే మీకీ ముప్పు ఉన్నట్లే..!
Night Shift Side Effects Health Issues: రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి పొంచి ఉంది. నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారిలో ఎక్కువమంది గుండెపోటుతో చనిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇలా జరగడానికి గల కారణాలను కూడా విశ్లేషించింది.
నైట్ షిఫ్ట్ వల్ల ఉబకాయం, గుండె జబ్బులు, గుండె పోటు వస్తాయి.
శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో శరీర జీవక్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్థమై జీవ గడియారాల్లో పెను మార్పులు సంభవిస్తాయని తేలింది.

నైట్‌షిఫ్ట్ నెలల తరబడి కొనసాగిస్తున్నట్లయితే క్యాన్సర్, ఒబెషిటీ, కిడ్నీసహా పలు వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నైట్‌షిఫ్టుల్లో పనిచేసే మహిళలకు పుట్టే బిడ్డలు కూడా అంత ఆరోగ్యంగా ఉండటం లేదని కొన్ని పరిశోధనల్లో తేలింది.
రాత్రిపూట పనిచేసే వారు ఉదయం పూట కన్నా సాయంత్రం సమయాల్లో నిద్రించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.