Si swarnalyatha case : సీఐ స్వర్ణలత కేసులో మరో ట్విస్ట్.. ఇలాంటి పోలీస్ లు కూడా ఉంటారా!
Si swarnalyatha case : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 2000 రూపాయల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత గురించి రోజుకొక ట్విస్ట్బ యటకు వస్తుంది. తీగల లాగితే డొంకంతా కదిలినట్లు.. అధికారులు ఇన్నివేస్టిగేషన్ చేసిన కొద్దీ రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. తాజాగా ఈ సీఐ స్వర్ణలత కు సినిమాలంటే పిచ్చని తెలిసింది. ఈమె ఒక చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించినట్లు తెలుస్తుంది. ఆమెకు ఒక డైరెక్టర్ డాన్స్ నేర్చుకో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానంటూ చెప్పడంతో స్వర్ణలత ఒక కొరియోగ్రాఫర్ ని పెట్టుకొని డాన్స్ కూడా నేర్చుకుంది.

ఈమె నటిస్తున్న సినిమా పేరు ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్’… లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓరి దీని యేశాలు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ చిత్రంలో కూడా ఆమె పోలీస్ ఆఫీసర్ గానే నటించింది. అలాగే ఆ సినిమాలో పాటలకు డ్యాన్స్ కూడా చేసినట్లు తెలుస్తుంది. కానీ పాపం ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపే ఈమె నోట్ల మార్పిడి కేసులో ఇరుక్కుపోయింది.