మనవడి కేశఖండన కోసం మేకను బలిచ్చిన ఎస్సై…పలు సెక్షన్ల కింద కేసు నమోదు…!

ప్రపంచ దేశాలతో సహా మన దేశం కూడా ఆధునికత దిశగా అడుగులు వేస్తూ ఉంటె. ఇంకా మూఢనమ్మకాలు, జంతుబలులు కొనసాగుతున్నాయి. విషయంలోకి వెళ్తే… రాజస్థాన్ లో ఓ పోలీసు అధికారి మేకను బలివ్వడం జరిగింది. కోట జిల్లా డియోలీ-మాంఝీ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భన్వర్ సింగ్ ఇటీవల తన మనవడి కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహించాడు.
ఒక ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలో భన్వర్ సింగ్ మేకను బలిచ్చి , తన బంధువులందరికి విందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలా ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలి ఇచ్చిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా కావడంతో కోట జిల్లా గ్రామీణ ఎస్పీ శరద్ చౌదరి భన్వర్ ను విచారణకు పిలిపించాడు.
భన్వర్ సింగ్ మేకను బలిచ్చిన విషయం నిర్ధారణ కావడంతో అతడిని వెంటనే సస్పెండ్ చేసి, పలు సెక్షన్లతో కేసు నమోదు అయింది.