Shreya gave birth to a baby : షాక్ మీద షాక్ ఇస్తున్న శ్రియ సరన్ :-

Shreya gave birth to a baby : శ్రియ , ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 2 దశాబ్దాలు గా యువతని తన చుట్టూ తిప్పుకుంటుంది ఇప్పటికి కూడా.
అయితే 2018 లో ఈ అమ్మడు తన అభిమానాలకు దిమ్మతిరిగే రేంజ్ లో షాక్ ఇచ్చింది. అదేంటో కూడా మీకు తెలిసిందే.. తన పెళ్ళి , 2018 లో రష్యన్ బిజినెస్ మ్యాన్ అయినా ఆండ్రియి కోస్చెఫ్ ని వివాహమాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా పలకరించింది.
పెళ్ళయిన కూడా సినిమాలకు దూరం ఉండకుండా వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. చివరిగా పెళ్ళికి ముందు వీర భోగ వసంత రాయులు సినిమాలో నటించగా పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఇంకా ఆ తర్వాత కరోనా రావడం సినిమా షూటింగ్స్ ఆగిపోవడం తో శ్రియ తన భర్త తో ఎన్నో అడ్వెంచర్స్ చేసింది. ఈ లాక్ డౌన్ లో తాను ఎన్ని రకాల అడ్వెంచర్స్ చేసిందో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చుస్తే తెలిసిపోతుంది.
ఇదిలా ఉండగా శ్రియ కి తన అభిమానులు కు షాక్ ఇయ్యడం ఇష్టం ఏమో. ఎదో ఒక షాకింగ్ విషయం మోసుకుని వస్తది. అప్పుడు పెళ్ళి ప్రస్తావన అందరిని ఎలా షాక్ కి గురిచేసిందో. ఇపుడు శ్రేయ పెట్టిన పోస్ట్ కూడా అంతే షాక్ కి గురిచేస్తుంది.
మ్యాటర్ లోకి వెళ్తే శ్రేయ 2018 లో పెళ్ళి చేసుకొని లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే శ్రేయ కి ఒక పాపా పుట్టిన సంవత్సరానికి పాపతో కలిసి వీడియో చేసి పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది.
ఎవరైనా ప్రేగ్నన్ట్ అయినప్పటినుంచి సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కానీ శ్రేయ పాపా పుట్టిన 9 నెలలకి ఈ విషయం సోషల్ మీడియా లో చెప్పింది. దీనితో పాటు పాపా పేరు రాధా అని పెట్టారని , ఆ పేరు శ్రేయ భర్త కి ఇష్టం అని వెల్లడించింది.
ఏదేమైనా షాకింగ్ వార్తలు చెప్పడం లో శ్రేయ ని మించినోళ్లు లేరు. అయితే ప్రస్తుతం శ్రేయ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో ముఖ్య పాత్రతో మరల ఆన్ స్క్రీన్ లో కనిపించి కనువిందు చేసేందుకు సిద్దమయింది.