Actress Shraddha Das : చైల్డ్ ఆర్టిస్ట్ తో నటిస్తున్న శ్రద్ధ

Actress Shraddha Das : అవునండి మీరు విన్నది , మేము చెపింది నిజమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా, భాషకు సంబంధం లేకుండా ఎన్నో వందల సినిమా తీసిన ఒకేఒక ఆర్టిస్ట్ మహేంద్ర. ఇప్పటికి మీకు గుర్తురాకపోతే ఒకసారి పెద్ద రాయుడు మరియు దేవి సినిమాలు జ్ఞాపకం తెచ్చుకోండి టక్కుమని గుర్తొచ్చేస్తాడు.
ఆ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్ర తోనే మన అందాల భామ శ్రద్ధ దాస్ కలిసి నటించింది. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విడుదల చేశారు. ఈ సినిమా ని సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకేకించి అర్ధం అనే టైటిల్ ని పెట్టారు చిత్ర బృందం. ఈ సినిమా లో కీలక పాత్రలో అజయ్ , ఆమని , సాహితి ఆవంచ , నందన్ నటించబోతున్నారు.
ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మినర్వా మూవీ మేకర్స్ మరియు శ్రీ వాసవి మూవీ ప్రొడక్షన్స్ ద్వారా రాధిక శ్రీనివాస్ నిర్మించారు.
ఈ సినిమా ని భారీ లెవెల్ లో ప్లాన్ చేసినట్లు తెలుసుతుంది. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేయగ దర్శకుడిగా ఎడిటర్ మరియు VFX టెక్నీషియన్ గా పనిచేసిన మణికాంత్ తలగుటి చేయబోతున్నారు.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రొమోషన్స్ పనిలో నిమగ్నం అవ్వబోతున్నారని ఫస్ట్ లుక్ విడుదల థమన్ తో విడుదల చేయడం ద్వారా తెలిసింది. త్వరలో విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు. చూడాలి మరి మహేంద్ర డెబ్యూ మూవీ ఎలా ఉండబోతుందో మరి.