movie reviews

సినిమా :- Shershaah (2021)

సినిమా :- Shershaah 2021

నటీనటులు:- సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ

నిర్మాతలు:- కరన్ జోహర్, హిరూ యాష్ జోహర్, అపూర్వ మెహ్త, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ

డైరెక్టర్ :- విష్ణువర్ధన్

లాక్ డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన షేర్షా సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.

కథ :-

ఈ కథ విక్రమ్ బాత్రా (సిద్ధార్థ్ మల్హోత్రా) యొక్క బాల్యం నుంచి మొదలవుతుంది. అతనిది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న పట్టణం. ఇదిలా ఉండగా అయన జీవితం లో కోరుకున్న కల ఒకటే ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని. అయితే విక్రమ్ బాత్రా ఆర్మీ ఆఫీసర్ అయ్యాక 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం లో అతను మరియు బృందం ఏ విధంగా పోరాడారు? యుద్ధం లో గెలిచారా లేదా? యుద్ధం లో గెలిచి ఎలా బయటపడ్డారు అనేదే ముఖ్య కథనం? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.

👍🏻:-

  • సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కైరా అద్వానీ తమ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తారు. సిద్ధార్థ్ మల్హోత్రా కార్గిల్ యుద్ధం లో పోరాడిన వీరుడిలాగా చక్కగా నటించి సినిమాకి ప్రాణం పోశాడు.
  • కథ మరియు కథనం ఆలోచింపచేసేలా ఉన్నాయి.
  • దర్శకుడు ప్రతి చిన్న విషయం చాల క్లియర్ గా చూపించేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.

*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.

👎🏻:-

  • మిగితా నటీనటులు కొత్త వాళ్లవడంతో ప్రేక్షకులని అలరించలేకపోయారు.
  • లవ్ ట్రాక్ మరియు మొదటి 30 నిమిషాలు బోరే.

ముగింపు :-

మొత్తానికి షేర్షా అనే చిత్రం కార్గిల్ యుద్ధం లో వీరత్వంగా పోరాడిన ఒక ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఇది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా నటించడం కన్నా పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. లవ్ ట్రాక్ పెద్దగా అలరించకపోయిన వార్ సన్నివేశాలు, యుద్ధం ఎలా జరిగింది అనేది చాల అద్భుతంగా తీశారు. మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగున్నాయి. దర్శకుడు అద్భుతంగా తీశాడు. కథ మరియు కధనం బాగున్నాయి. బయోపిక్ ని మంచి కధనం తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. మొత్తానికి ఈ వారం కుటుంబం అంత కలిసి చక్కగా ఈ సినిమాకి చూసేయచు.

Rating:- 3.25/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button