She Taxi Applications: షీ ట్యాక్సీలు పొందాలనుకుంటున్నారా… ఐతే ఇలా దరఖాస్తుకు చేయండి…!

She Taxi Applications In Hydradbad: హైదరాబాద్ నగర మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం షీ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ట్యాక్సీ నడుపుకొని మహిళలకు సపోర్ట్ గా ఉండలనుకొనే మహిళామణులకు కారు కొనేందుకు బారి సబ్సిడీ అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.
మహిళలు టాక్సీ నడుపుతూ అధిక ఆదాయం పొందడంతో పాటు ఆకతాయిల పని పట్టడానికి ఈ కార్యక్రమానికి తెరలేపింది టీఆరెస్ ప్రభుత్వం. ఇలా తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో షీ ట్యాక్సీ పథకాన్ని పొందడానికి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు ప్రకటనను విడుదల చేసారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబం లోని మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు గా వీరికి సబ్సీడీపై ట్యాక్సీలను ఇవ్వనున్నారు.
ఇందుకోసం మహిళలు 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. అదేవిదంగా 18 ఏళ్లు నిండిన మహిళలలు ఈ పథకానికి అర్హులని అధికారులు వెల్లడించారు. ఇక ఈ పథకం లో అర్హులైన వారికీ 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్ అమౌంట్‌తో మొత్తం 45 శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను మహిళలకు ఇవ్వనున్నారు. ఇక అర్హత సాధించిన మహిళలకు నెల రోజుల డ్రైవింగ్‌లో శిక్షణ అందించి మరి వారికీ క్యాబ్ డ్రైవర్లుగా పూర్తీ మెళకువలు అందించనున్నారు.
డ్రైవింగ్ అంటే ఆశక్తి ఉన్న ప్రతి మహిళ ఈ ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని అక్కేశ్వర్ రావు తెలిపారు. ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా సీడీపీవో కార్యాలయాల్లో అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచుని వెల్లడించారు.