Sharwanand Vs Baalayya for the 3rd time : బాలయ్యతో తగ్గేదెలా అంటున్న శర్వానంద్ :-

Sharwanand Vs Baalayya for the 3rd time : అదేంటో గాని శ్వరానంద్ కి పెద్ద హీరోలతో పోటీగా సినిమాలు రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అందులోనూ బాలయ్య సినిమాతో పొట్టి పడటం అలవాటయిపోయింది. ఇపుడు మూడవసారి బాలయ్య తో పోటీ పడటానికి సిద్ధం అయినా శర్వానంద్.
అయితే గతంలో అంటే 2016 సంవత్సరం లో బాలయ్య బాబు డిక్టేటర్ అనే సినిమా రిలీజ్ అయితే దానికి పోటీగా శర్వానంద్ ఎక్ష్ప్రెస్స్ రాజా తో వచ్చారు. రెండు సినిమాలు భారీగా హిట్ అయ్యాయి , కలెక్షన్ ల వర్షం కురిపించాయి.
దీని తదుపరి సంవత్సరం అంటే 2017 లో బాలయ్య బాబు గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమాతో రాగ శర్వానంద్ శతమానం భవతి అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. రెండు వేరే వేరే కోవకు చెందిన కథలైనా కలెక్షన్స్ లో రెండు పోటాపోటీగా వసూలు చేసాయి.
ఇపుడు వీరిద్దరూ మరల పోటీపడటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయ్యింటది. వచ్చే నెల అనగా అక్టోబర్ లో బాలయ్య బాబు అఖండ తో థియేటర్ లో హుంగామ చేయడానికి సిద్ధం అవ్వగా , శర్వానంద్ కూడా అజయ్ భూపతి దర్శకత్వం లో సిద్ధార్థ్ ని కో- స్టార్ గా పేటి తెస్తున్న మహా సముద్రం అనే మల్టీ స్టార్రర్ సినిమా సిద్ధం చేసారు.
ఈ సినిమా అక్టోబర్ 14 న విడుదలకు సిద్ధం అవుతుంది. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వనుంది. ఆటుపోతే బాలయ్య అఖండ సినిమా మీద అప్ డేట్స్ ఇంకా రాకపోయినా అక్టోబర్ లోనే అఖండ విడుదల అవుతుంది అని అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
చూడాలి మరి ముచ్చటగా మూడవసారి బాలయ్య మరియు శర్వానంద్ కలిసి థియేటర్స్ లో ఏ రేంజ్ హుంగామ చేయబోతున్నారో.