Sharukh Khan As Kathi Kondala Rayudu : కత్తి కొండలరాయుడు గా షారుక్ ఖాన్ :-

Sharukh Khan As Kathi Kondala Rayudu : హీరో పేరు కి హెడ్డింగ్ కి సంబంధమే లేదు అనుకుంటున్నారు కదా. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మొన్నటివరకు హిందీ సినిమాలే తీయడం తో ఇలాంటి హెడ్డింగ్ చూసిండరు. అయితే నవంబర్ నుంచి తమిళ్ డైరెక్టర్ అయినా అట్లీ తో సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో చెబుతున్న వార్తే.
అయితే ఈ సినిమా తమిళ్ , తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. కాబట్టి షారుక్ ఖాన్ సినిమా మొట్ట మొదటి సారి స్ట్రెయిట్ గా తెలుగు , తమిళ్ లో విడుదల కానుంది. ఆ ఘనత అట్లీ కె దక్కుతుంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి టైటిల్ గా ఎన్నో పేర్లు అనుకున్నారు , అయితే ఇపుడున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ని హిందీ లో రాజా వర్ధన్ ఠాకూర్ అని, తెలుగు లో కత్తి కొండలరాయుడు అని మరియు తమిళం లో వేలుస్వామి మురుగన్ అని టైటిల్స్ అనుకున్నట్లు తెలుసుతుంది.
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా షూట్ మొదలైనప్పటినుంచి ఇలాంటి వార్తలు ఎన్నో రాబోతున్నాయి. ప్రస్తుతానికి షారుక్ ఖాన్ అట్లీ సినిమా టైటిల్ తెలుగు లో కత్తి కొండలరాయుడు అని ఖరారు చేసినట్లు తెలుసుతుంది.
చూడాలి మరి మాస్ ఎలివేషన్ తో అట్లీ షారుక్ ఖాన్ ని ఏ రేంజ్ లో చుపియబోతున్నాడో అని.