News

తప్పతాగి కారు నడిపిన యూట్యూబర్ అరెస్ట్…పలువురికి గాయాలు…!

రాజధాని హైరాబాదులో వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. అదేసమయంలో మరో ఘటన  కొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ లోనూ  చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.10లో ఒక కారు అతి వేగంగా దూసుకొచ్చి రెండు కార్లు, ఒక  బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో  బైకర్ పై వున్నవ్యక్తి కి   తీవ్ర గాయాలయ్యాయి.

ఇంత గోర ప్రమాదానికి  కారణమైన కారు డ్రైవింగ్ చేస్తుంది ప్రముఖ తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గా గుర్తించారు. కారు నడుపుతున్న సమయంలో షణ్ముఖ్  మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

shanmukh jaswanth car accident

షణ్ముఖ్ కి  బ్రీత్ అనలైజర్  తో చెక్ చేయగా , రీడింగ్ లో 170 పాయింట్లు చూపించినట్టు తెలిపారు.  తరువాత కారు ను , షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button