ఈరోజు శని అమావాస్య విశేషాలు – shani amavasya speciality
shani amavasya speciality

ఈరోజు ఆరాధన విశేషాల క్రమం
shani amavasya speciality
ఈరోజు మార్గశిర అమావాస్య శనివారం తో కూడి యుంది, నక్షత్రం మూలా.ఈ అమావాస్య శని అమావాస్య కాబట్టి శనిగ్రహ దోషాలతో భాదపడుతూ ఉండేవారికి ఉపయోగపడే రోజు. ఈరోజుఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటివి నడిచే వారు సమీపం లో ఉన్న ఆలయంలో శని ఆరాధన చేయండి. శని ప్రీతిగా నల్ల నువ్వుల దానం ఇవ్వండి. నల్ల కుక్కలకు లేదా కాకికి ఆహరం ఇవ్వండి. పిల్లలకు పల్లి పాకం దానం చేయండి. నేరేడు లేదా నల్ల ద్రాక్ష ను నివేదన చేయండి. వీలయినంత మటుకు ధర్మ బద్దంగా జీవించండి. కాళీ మాతకు ఉపవాసం ఉండటం అన్నది బహు ఉపయోగకరమైనది.
shani amavasya speciality
మరొక విశేషం అమావాస్య కాబట్టి పితరుల అనుగ్రహము కోసం నేడు మధ్యాహ్న సమయంలో ఆరుబయట కూడి చేతి బొటన వేలు మీదుగా తిలతర్పణం వదలండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈరోజు వల్లె వేయాల్సిన సులభ మంత్రం.
ఓం పితృ దేవేభ్యో నమః