Noel: నోయల్ తో విడాకులు పై సంచలన వ్యాఖ్యలు చేసిన షకీలా బయోపిక్ హీరోయిన్ ఈస్టర్…

నోయెల్ పేరు అందరికీ సుపరిచితమే. అటు సింగర్ గా ను… ఇటీవలె బిగ్బాస్ 4 కంటెస్టెంట్ గాకు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో మొదట మంచిగా నోయల్ కొనసాగిన … అనారోగ్య కారణాలతో ఇంటిని వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే టాప్ 5 లో గ్యారెంటీగా నోయెల్ ఉండేవాడని అభిమానులు చెప్తున్నారు.

నోయల్ కుమారి 21F, రంగస్థలం,ఈగ వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. నోయల్ 2019 జనవరి 3న హీరోయిన్ ఈస్టర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈమె భీమవరం బుల్లోడు , 1000 అబద్దాలు, గరం మరియు జయ జానకి నాయక చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వివాహం చేసుకున్న ఏడాదికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత హీరోయిన్ ఈస్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో నోయెల్ తో విడాకులు తీసుకోవడం పట్ల క్లారిటీ ఇచ్చింది. నోయల్ అంటే తనకు వ్యక్తిగతంగా గౌరవమని అలాగే మంచివాడని కానీ తన గోల్స్ నా గోల్స్ డిఫరెంట్ అని.. అది మా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపి విభేదాలకు దారితీయడంతో …వైవాహిక జీవితం కొనసాగించలేని నోయెల్ తో విడాకులు తీసుకున్నట్లు ఈస్టర్ తెలిపింది. ప్రస్తుతం ఈస్టర్ ప్రముఖ నటి షకీలా బయోపిక్ లో షకీలా పాత్రని పోషిస్తుంది.