News
shabnam case : షబ్నమ్ ఉరి శిక్ష విషయంలో… రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరిన నిందుతురాలి కుమారుడు…!


shabnam case : కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో ఉరి శిక్ష పడిన యూపీ మహిళ షబ్నమ్ ను ఉరితీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో షబ్నమ్ ఒక వ్యక్తిని ప్రేమించింది. తన ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలవడంతో , వారు తన ప్రేమని ఒప్పుకోలేదు. ఇదే విషయంలో వారి కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్, ఏకంగా వారందరిని తన ప్రియునితో కలిసి హతమార్చింది.

ఈ మహిళ విషయంలో ఉరి శిక్షకు సన్నాహాలు జరుగుతున్నా సమయంలో, గవర్నర్ వద్దకు షబ్నమ్ కుమారుడు క్షమాబిక్ష పిటిషన్ ఇచ్చాడు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వద్దకు కూడా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఇంకా దీనిపై నిర్ణయం వెలువడలేదు. దీన్ని బట్టిచూస్తే… షబ్నమ్ ఉరిశిక్ష విషయంలో గవర్నర్, రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.