Tollywood news in telugu

shaadi mubarak review : ‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ… అంతా కారులోనే..!

shaadi mubarak review

ఆర్కే నాయుడు పాత్ర ద్వారా ‘మొగలిరేకులు’ సీరియల్‌లో  గుర్తింపు తెచ్చుకున్న ‘సాగర్’ ఇపుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గతం లో  ‘సిద్దార్థ’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అపుడు ఆ  సినిమా సాగర్‌కు నిరాశే మిగిల్చింది. ఆ తరువాత చాల రోజుల గ్యాప్ తరువాత ఇపుడు సాగర్ , ‘షాదీ ముబారక్’ అనే సినిమాతో లవర్ బాయ్‌గా వస్తున్నాడు. అలాగే ఈ మూవీ తో ‘ దృశ్యా రఘునాథ్’‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో …  పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఇపుడు ఈ సినిమా   శుక్రవారం (మార్చి 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ  సినిమాను చూసినవాళ్లు  పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా  ఇదొక క్యూట్ లవ్ స్టోరీ గా చెప్పుకుంటున్నారు.

ఇందులో సినిమా మొదటిభాగం మొత్తం  ఒక కారులోనే నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా  బోర్ కొట్టకుండా చూసుకున్నారు. ఈ విషయంలో దర్శకుడు పద్మశ్రీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.  పెళ్లి చూపులకు అబ్బాయిని తీసుకెళ్లిన అమ్మాయి….. కొన్ని గంటల్లోనే అతడి ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎలా ప్రేమాయణం నడిపించారు… అనే కథనాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ఒక వైపు కామెడీని పండిస్తూ… మరోవైపు లవ్ స్టోరీ.. ఈ రెండింటినీ పర్ఫెక్ట్‌గా బాలెన్స్ అయ్యేవిదంగా దర్శకుడు తెరకెక్కించాడు.

Read  అందాల అనసూయా....

 సున్నిపెంట మాధవ్‌ పాత్రలో హీరో సాగర్ లీనమై ఇరగదీసాడు.  హీరోయిన్‌ దృశ్యా రఘునాథ్‌ హావభావాలు, నటన సినిమాకు ప్లస్ అయ్యాయని అంటున్నారు. తెలుగమ్మాయిలా కనిపించిన ఈ కేరళ కుట్టికి తలరాత తిరిగినట్టే  అంటున్నారు. ఇందులో ప్రత్యేకంగా తుపాకుల సత్యభామ పాత్ర తెలుగు ప్రేక్షకులకు చాల దగ్గరవుతుంది. అలాగే గుర్తుండి  పోతుంది కూడా అని తెలుస్తుంది. మొత్తానికి ఈ వేసవికాలం చల్లని ఆనందాన్ని పంచేందుకు మన ముందుకు వచ్చిందనే చెప్పాలి.

 మరి ఈ సినిమా హిట్ లిస్టులోకి ఎక్కుతుందా లేదా అనేది రాబోయే కలెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button