Viral news in telugu

సుమ, రాజీవ్ కనకాల నుంచి ప్రియాంక మధుబాబు వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ జంటలు… వీరే…!

టీవీ సీరియల్స్ లో తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, వారికంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్న  నటీనటులు చాలా మందే ఉన్నారు. అలా నటిస్తూ.. వారి  కో యాక్టర్స్‏ను ప్రేమించి పెళ్లిచేసుకున్న నటీనటులు ఉన్నారు.  వారిలో కొందరి గురించి మీకోసం…

Serial couples in love and married

రాజీవ్ కనకాల, సుమ జంట గురించి తెలియనివారు ఉండరు. టెలివిజన్ ద్వారా వీరి పరిచయం కాస్త పెళ్లివరకు వెళ్లి , 1999లో ఒకటయ్యారు.

నిరుపమ్ పరిటాల కు , చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచమైన మంజుల, కొద్దిరోజులు ప్రేమాయణం సాగించి మూడుముళ్ల బంధంతో కలిసిపోయారు.

చక్రవాకం టీవీ సీరియల్ ద్వారా మేఘనా రామి, ఇంద్రనీల్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి, ఆ తరవాత పెళ్లితో ఒకటయ్యారు.

జాకీ, హరిత కూడా ఒక  టీవీ షోలో కనులూ కనులూ  కలిసి ఆతర్వాత ప్రేమవివాహంతో ఒకటయ్యారు.

చిన్న చిన్న టీవీ షో లో పరిచయం పెంచుకున్న  సుష్మా రవికిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

శ్యామల నరసింహ మొదటి సారి టీవీ షో ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమ బంధం బలపడి పెళ్లితో ఒకటయ్యారు.

ప్రియాంక నాయుడు…మధుబాబు దాదాపు కొన్నిసంవత్సరాలుగా ప్రేమించుకొని ఈ మధ్యనే పెళ్లితో కలిసిపోయారు.

స్వాతి చినుకులు సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్న  సిద్దార్థ్, విష్ణు ప్రియ  బాల్య స్నేహితులు. ఇందరూకూడా ఇండస్ట్రీలో ప్రేమ చిగురించి పెళ్లితో ఒకటయ్యారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button