Sehari Movie Review :-

Movie :- Sehari (2022) Review
నటీనటులు :- హర్ష కనుమిలి , సిమ్రాన్ చౌదరి , అభినవ్ మొదలగు
నిర్మాత :- అద్వత జిష్ణు రెడ్డి , శిల్ప చౌదరి
సంగీత దర్శకుడు :- ప్రశాంత్. ఆర్. విహారి
దర్శకుడు :- జ్ఞానసాగర్ ద్వారక
Story( Spoiler Free):-
కాలేజ్ రోజుల్లో ప్రేమించిన సుబ్బలక్ష్మి ,వరుణ్ ( హర్ష) యొక్క కుర్రతనాన్ని చూసి చిరాకు తెచ్చుకొని బ్రేక్ అప్ చెప్పే సీన్ తో సినిమా మొదలవుతుంది. అయితే వరుణ్ తనలోని ఈగొని చలార్చుకోవడానికి వెంటనే పెళ్ళి చేసేయండి అని ఇంట్లో చెప్పగా వెంటనే అలియా తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు.
కానీ అలియా తో పెళ్ళి కి సిద్ధమైన వరుణ్ కాలం గడిచేకొద్దీ అలియా సిస్టర్ అయిన అమూల్య ( సిమ్రాన్ ) ని ప్రేమించడం మొదలుపెడతాడు. ఇప్పుడు అస్సలైన కన్ఫ్యూజన్ డ్రామా స్టార్ట్ అవుతుంది. .
ఇప్పుడు హర్ష అలియా ని పెళ్ళి చేసుకుంటాడా లేదా అమూల్య ని పెళ్ళి చేసుకుంటాడా ? హర్ష బ్రేక్ అప్ ఎలా జరిగింది ? హర్ష , అమూల్య ని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో వారికి మరియు అలియా కి తెలిశాక ఎం చేశారు ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍 :-
- హర్ష నటన , మొదటి సినిమా అయినప్పటికీ బాగా నటించారు. సిమ్రాన్ కూడా చాలా బాగా నటించింది.
- దర్శకుడు జ్ఞానసాగర్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది.
- కామెడీ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉన్నాయి.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
Negatives 👎 :-
- లాజిక్స్ గురించి ఆలోచించకూడదు.
- కాస్త బోర్ కొడుతుంది.
Overall:-
మొత్తానికి సెహరి అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా యూత్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. మొదటి సినిమాతోనే హర్ష మంచి నటన చేసి ప్రేక్షకులని అలరించారు, సిమ్రాన్ కూడా చాలా బాగా నటించింది.
దర్శకుడు కథను నడిపే విధానం చాల బాగుంటుంది. కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి.
మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3 /5