Tollywood news in telugu

Seetimaarr Jwala Reddy song: ‘సీటీమార్’జ్వాలా రెడ్డి సాంగ్.. తమన్నా ఒంపుసొంపులతో మతి పోగొట్టింది…!

Seetimaarr Jwala Reddy song

తమన్నా తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి  15 సంవత్సరాలకు పైగా ఐన వన్నెతగ్గని అందంతో ఇప్పటికి ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంది.  ఈ బ్యూటీ తాజాగా విడుదలైన జ్వాలా రెడ్డి పాటలో తన నడుము ఒంపుసొంపులతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది. దర్శకుడు సంపత్ నంది  తాజాగా తమన్నా, గోపీచంద్ జంటగా ‘సీటీమార్’ మూవీ లో నటిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా సరిఅయిన హిట్ లేక నిరాశతో ఉన్న గోపీచంద్ కి ఈ చిత్రం ఎంతో కీలకం కానుంది.

గత 7 సంవత్సరాలకింద  వచ్చిన లౌక్యం సినిమా తర్వాత , గోపీకి ఇప్పటి వరకు చేసిన సినిమాలు హిట్ కొట్టలేదు.  మధ్యలో వచ్చిన జిల్, పంతం లాంటి సినిమాలకు పర్లేదనే అని మాత్రమే అనిపించాయి.  సంపత్ నందితోనే చేసిన గౌతమ్ నందా కూడా పత్తా లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం కబడ్డి నేపథ్యంలో ఉండనుంది. దీనికి సంబంధించి  ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌ గా  గోపీచంద్.. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌  గా మిల్కీ బ్యూటీ తమన్నా  ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఇపుడు తాజాగా ఈ మూవీ నుండి ఒక  రొమాంటిక్ మాస్ సాంగ్ రిలీజ్ అయింది . కాసర్ల శ్యామ్ రచించిన  ‘జ్వాలా రెడ్డి, బాల రెడ్డి’ అంటూ … సాగే ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించగా…  శోభి కొరియోగ్రఫీ చేయగా,  ఈ పాటను శంకర్ బాబు, మంగ్లీ పాడారు. ఈ పాటతో సినిమా పై  అంచనాలు భారీగా పెరిగాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button