Viral news in telugu

ఎవరికైనా పిల్లలు కలగకపోతే, పూజలు చేయడమో, పొర్లుదండాలు పెట్టడమో చేస్తూ ఉంటాం కానీ వీరు మాత్రం ఏంచేసారో చూడండి…!

See what they do.

హైదరాబాద్: కొందరికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు మాత్రం కలుగరు , అలాంటివారు తిరగని గుళ్లూగోపురాలు , హాస్పిటల్స్ ఉండవు. కానీ ఇక్కడ ఒక జంట మాత్రం ఇప్పటికి ఎవరుచేయని పనిని చేసి పోలీసులకు చిక్కి వార్తల్లో నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే… ఫిలింనగర్‌కు చెందిన సంతవరపు సిద్దేశ్(27), అతని భార్య సుజాత(25) కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరిని పిల్లలు లేరనే బెంగ వారిని వెంటాడుతోంది. ఆ సమయంలోనే వీరికి సిద్దేశ్ స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే నాగదేవత, కట్ట మైసమ్మ, లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తే.. ఇంట్లో ఉన్న పీడ తొలగిపోయి సంతాన కలుగుతుందని ఉచిత సలహా ఒకటి ఇచ్చాడు.

సిద్దేశ్ స్నేహితుడు మాటప్రకారమే ఆ దంపతులిద్దరూ కలిసి కుల్సుంపురా పీఎస్ పరిధిలోని నాగదేవత ఆలయంలో, లంగర్‌హౌజ్ పీఎస్ పరిధిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో  విగ్రహాలను ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసారు.

ఇక ఆ ఆలయ పూజారితో సహా స్థానికులు విగ్రహాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును సీరియస్‌గా తీసుకుని విచారించగా అసలువిషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితులను కౌన్సిలింగ్ ఇచ్చి , ఇకమీదట ఇలాంటివి నమ్మి జీవితం పాడుచేసుకోవద్దని చెప్పి వదిలిపెట్టారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button