Tollywood news in telugu
తెలంగాణలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం…!

Second phase of vaccination : తెలంగాణలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50లక్షల మందికి టీకా వేయడానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ 60 సంవత్సరాలు దాటినవారికి, అలాగే 45-60 సంవత్సరాల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతన్న వారికి మాత్రమే టీకాను వేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగనుంది. టీకా కోసం ఇక 60 సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కార్డు, లేదా ఎదో ఒక ఐడి ఫ్రూఫ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.