Today Telugu News Updates
అంబానీపై రూ.40 కోట్ల బారి జరిమానా విధించిన సెబీ !

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సహా సంస్థ అధినేత ముకేశ్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బారి జరిమానా విధించింది. 2007 సంవత్సరం లో రిలయన్స్ పెట్రోలియం షేర్ల అక్రమ లావాదేవీలకు విషయంపై రూ.40 కోట్ల జరిమానాను విధించింది. ఈ జరిమానాలో రూ.15 కోట్లు అంబానీ చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
దీనికి సంబందించి నగదు, ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఈ షేర్ల అక్రమ లావాదేవీలకు సహాయపడిన నవీ ముంబై సెజ్, ఈ కంపెనీలపై రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ సెబీ విచారణ అధికారి బీజే దిలీప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.