Today Telugu News Updates
Sourav Ganguly: సౌరభ్ గంగూలీకి అస్వస్థత…ఆందోనళకు గురి అవుతున్న అభిమానులు !

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా ఒక్క సరిగా ఛాతి నొప్పితో కిందపడిపోయారు. వెంటనే జిమ్ సభ్యులు వెంటనే గంగూలీ ని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేర్చారు.
గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించగా ఇపుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే గంగూలీ భారత జట్టు కు ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో ఎన్నో విజయాలను అందుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 11,363 పరుగులు చేయగా అందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు చేసారు.
ఇక టెస్ట్‌ల్లో 7,212 రన్స్ చేసారు గంగూలీ. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ గంగూలీకి మంచి పేరే ఉంది.