telugu gods devotional information in telugu
శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన
కలియుగములో వేంకటేశ్వర స్వామి వారి మహత్
కృతయుగం లో నారసింహ స్వామి,త్రేతాయుగంలో రామచంద్ర పరబ్రహ్మ,ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ,ఇక కలియుగములో వెంకటాచలపతి గా పిలిస్తే పలుకుతూ భక్తులను కరుణ చూపిస్తూ ఉంటాడు.
వేం అనగా పాపాలు ,కట అనగా ఖండించువాడు లేదా హరించు వాడు అని పేరు.అనగా కలియుగములో జనులు చేయు పాపాలు పటాపంచలు చేసీ తనను శరణు అన్న వారిని భక్తితో వేడిన వారిని సదా రక్షిస్తు ఉంటాడు.అందువల్లే ప్రపంచలొనే అత్యంత రద్దీ గల దేవాలయంగా తిరుమల ఖ్యాతి గాంచింది.స్వామి వారి కరుణ చేత సకల గ్రహ దోషాలు తొలగిపోయి ఆనందం గా ఉంటారు.కలియుగములో గోవిందా అని ఆర్తీ తో పిలిస్తే చాలు వెంటనే కరుణించి కాపాడతాడు అని పురాణ వచనం.
ఓం నమో వేంకటేశాయ.
గోవిందా గోవిందా