Tollywood news in telugu

sashi movie trailer :పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ‘శశి’ సినిమా ట్రైలర్ విడుదల…!

sashi movie trailer

 sashi movie trailer : శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘‘శశి’’ . ఈ సినిమా ట్రైలర్ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్  విడుదల చేశారు. 

ఈ మూవీని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్పీ వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా… ఇందులో   సురభి, రాశీసింగ్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదేవిదంగా ముఖ్య పాత్రలలో  రాజీవ్ కనకాల, అజయ్ లు నటిస్తున్నారు.

మర్చి  19న  ఈ మూవీ తెలుగు  ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఈ సినిమాలో అరుణ్ చిలివేరు సంగీతం అందించగా.. ఇందులో  ‘ఒకే ఒక లోకం’ పాటకు ఎనలేని స్పందన లభించింది. ఎక్కడ చుసిన ఈ పాట మారుమోగిపోతుంది.

ఇక ఇందులో ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి’ అంటూ ఆది చెప్పిన డైలాగ్ చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేవిదంగా  ‘మనల్ని చూసి ఎవడైనా భయపడాలి కానీ, ఎవడినో చూసి మనం భయపడడం ఏంటీ’ అంటూ హీరోయిన్ చెప్పిన  డైలాగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button