Tollywood news in telugu

sashi movie review : శశి సినిమా రివ్యూ ..

sashi movie review

నిర్మాతలు : ఆర్.పి.వర్మ and  రామంజనేయులు and  చింతలపుడి శ్రీనివాస్.

దర్శకత్వం : శ్రీనివాస్ నాయుడు నడికట్ల.

నటీనటులు : సుర్భి పురాణిక్,  ఆది. 

సంగీతం : అరుణ్ చిలువేరు

ఎడిటింగ్ : సత్య . జి

సినిమాటోగ్రఫీ : అమర్నాధ్ బొమ్మిరెడ్డి

 ఆది హీరోగా విడుదలైన సినిమా సినిమా ‘శశి’. ఈ మూవీ  లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల  ముందుకు వచ్చింది.  ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటించారు. ఇంకా ముఖ్య తారాగణం  రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటించారు.

కథ విషయానికి వస్తే..

ఈ మూవీలో ఆది (రాజ్) కనీస కుటుంబ బాధ్యతలు మోయకుండా తాగుతూ అప్పుడపుడు తనలోని మ్యూజిక్ టాలెంట్ ని బయటపెడుతూ ఉంటారు. రాజ్ అన్న  అజేయ్ (అజేయ్) పెళ్లి చేసుకోకుండా కుటుంబ భారాన్ని తనపై వేసుకొని ,  తమ్ముడి ఎలా బాగు పడుతాడో అని  బాధ పడుతూ ఉంటాడు. ఈ మధ్యలో శశి (సురభి)ని చూసిన రాజ్, ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెతో మధురమైన క్షణాలను ఊహించుకుంటూ ఉంటాడు. అసలు ఇంతకీ సురభి వెనుకే రాజ్ ఎందుకు పరిగెత్తుతున్నాడు. ? వాళ్ళ మధ్య గతంలో ఉన్న ఏదైనా అనుబంధం ఉందా  ? అసలు శశికి ఉన్న సమస్యలు ఏంటి  ? అన్నిటికంటే ముఖ్యంగా రాజ్ ఎందుకు బాధ్యత లేకుండా ఆవరలాగా మారాడు  ? ఈ అంశాలపై కథ సాగుతుంది.

ఇక ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే..

ఈ మూవీలో కొంచం కొత్తగా  ట్రై చేసి,  తన నటనతో సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసాడు.  అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ లో కొత్తగా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన మార్క్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. అదేవిదంగా  ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆది తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక శశి క్యారెక్టర్ లో హీరోయిన్ గా నటించిన సురభి ఎంతో బాగా చేసింది.

ఇంకా చెప్పాలంటే  కొన్ని ప్రేమ సన్నివేశాల్లో,  ఎమోషనల్ సీన్స్ లోనూ సురభి ఆకట్టుకుంది.  అలాగే రాశి సింగ్ నటన, ఆదితో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఎమోషనల్ సీన్ లో ఆది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక మిగిలిన నటీనటులు  రాజీవ్ కనకాల, అజయ్, వెన్నెల కిషోర్ లు వారి వారి పత్రాలు న్యాయం చేసారు. ఇంకా  కమెడియన్ హర్ష  బాగానే ఎంటర్టైన్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు  స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో చూపించలేక పోయారు. మొదటి భాగం లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, రెండవ భాగం లో  సినిమాను  సాగతీసారు .

 ప్రేక్షకులకు కనెక్ట్  కాలేక పోయిందనే చెప్పాలి , దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ఎమోషన్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ప్రాధాన్యత ఇచ్చాడు.  దాంతో సీన్స్ బోర్ గా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని కోల్పోయేలా చేసింది.

ఇక చివరగా.. చెప్పేది ఏంటంటే…

 ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అదేవిదంగా , సురభి గ్లామర్ మరియు పాటలు బాగున్నాయి.  లవ్ స్టోరీస్ లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను,  దర్శకుడు సరిగా తెరకెక్కించలేదు.  కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే కొన్ని లవ్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. మొత్తం మీద ఈ సినిమా లవ్ స్టోరీ కి సంబంధించింది కాబట్టి ఒక సారి చూడొచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button