Sarpatta Parampara : సర్పట్ట పరంపర (2021)

Sarpatta Parampara Movie Review And Rating :- సర్పట్ట పరంపర (2021)
నటీనటులు :- ఆర్య, సంచన నటరాజన్
నిర్మాతలు:- : షణ్ముగం ధక్షన్‌రాజ్
డైరెక్టర్ :- పా. రంజిత్
లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓ టీ టీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు ఆర్య నటించిన సర్పట్ట పరంపర సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
Sarpatta Parampara Story:
ఈ కథ 1970 కాలంనాటిది. ఆ కాలంలో చెందినవాడే మన హీరో సమరా(ఆర్య). ఇతను చెన్నై హర్బోర్ లో కార్మికుడిగా పనిచేస్తుంటాడు , కానీ ఒక గొప్ప బాక్సర్ అవ్వాలన్నదే తన కోరిక. దానికోసం ఎంతగానో కష్టపడుతుంటాడు. అనుకోకుండా ఒక రోజు అతనికి బాక్సింగ్ రింగ్ లో ఆడే అవకాశం వస్తది. మొదటిసారే అయినా బాగా బాక్సింగ్ చేస్తాడు. ఇదిలా ఉండగా తాను బాక్సింగ్ ఆడటం వాళ్ళ ఎన్నో ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి వస్తది. తన బాక్సింగ్ కెరీర్ కి ఎన్నో ఆటంకాలు. అసలు సమరా జీవితంలో ఎం జరుగుతున్నాయి? ఎవరు అతని బాక్సింగ్ కెరీర్ కి అడ్డుపడుతున్నారు ? చివరికి సమరా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు లేదా ? అని తెలుసుకోవాలంటే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.
👍🏻:-
- ఆర్య చాల కొత్తగా మరియు తనదైన శైలితో ప్రజల హృదయాల్ని మరోసారి గెలుచుకున్నాడు. ఒక బాక్సర్ పాత్ర కోసం తాను పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది. సహాయ పాత్రలో చేసిన ప్రతి ఒక్కరు సినిమాకి మరింత ప్రాణం పోశారు.
- కథ కొత్తగా మరియు పా. రంజిత్ స్టైల్ లో ఉంది. దర్శకుడిగా పా . రంజిత్ ఎప్పటిలాగే తనదైన శైలిలో చిత్రాన్ని చిత్రీకరించారు.
- మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది.
*సినిమాటోగ్రఫీ చాల బాగా తీశారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎🏻:-
- సినిమా కధనం సరిగ్గా లేదు.
- సినిమా నిడివి చాల పెద్దగా ఉంది 175 నిముషాలు.
- కొని సందర్భాలలో సినిమా బోర్ కొడుతోంది.
ముగింపు :-
మొతానికి సర్పట్ట పరంపర అనే సినిమా ప్రజలందరినీ అలరిస్తాది. ఆర్య చాల కొత్తగా మరియు అద్భుతంగా నటించి ప్రజల హృదయాలను గెలుచుకుంటాడు. కథ కొత్తగా మరియు విభినంగా రాసుకున్నారు. పా.రంజిత్ దర్శకత్వం ఎప్పటిలాగే తనదైన శైలిలో చిత్రీకరించారు. బాక్సింగ్ సన్నివేశాలు చాల బాగా తీశారు. కధనం లో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉండింటే సినిమా మరింత బాగుండేది. సినిమా నిడివి పెద్దగా ఉండటం వాళ్ళ బోర్ కొట్టే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి ఈ వారం లో కుటుంబం అంత కలిసి ఆర్య నటన కోసం ఈ చిత్రాన్ని ఓసారి చూసేయచ్చు.
రేటింగ్ :- 2.75/5