జనవరి 5న సూపర్‌స్టార్ మహేష్’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్!!
జనవరి 5న సూపర్‌స్టార్ మహేష్’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్!!
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ మాస్ సాంగ్, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం నుండి అందరూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్ ` హీ ఈజ్ సో క్యూట్`ను ఈ సోమవారం సాయంత్రం 05.04 గంటలకు విడుదలచేయనుంది.
కాగా ఈ చిత్రం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో జరపనున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న విషయంతెలిసిందే…
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర,తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.