Sandalwood Power Star Puneeth Rajkumar is No More : గుండెపోటు తో పునీత్ రాజ్ కుమార్ మృతి :-

Sandalwood Power Star Puneeth Rajkumar is No More : అవును మీరు చదివింది నిజమే. శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు అనే వార్త చెప్పడం ఎంతో బాధకారం. కొద్దిసేపటి క్రితమే పునీత్ రాజ్‌కుమార్ గారు చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ అధికారులు చెప్పడం జరిగింది.
అయితే ఎప్పటిలాగే పునీత్ రాజ్‌కుమార్ జిం కి వెళ్ళారు , వర్కౌట్స్ చేశారు కాకపోతే సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చి పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్స్‌లో ఐసీయూలో చేర్చినట్లు తెలుస్తుంది. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా పునీత్ రాజ్‌కుమార్ గారి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ వార్తని అభిమానులే కాదు యావత్ ప్రజలు నమ్మడం లేదు.
ఎందుకంటే అయన వయస్సు 46 సంవత్సరాలు మరియు ఎల్లపుడు ఫిట్నెస్ కోరుకునే మనిషి కాబ్బటి. అలాంటి పునీత్ రాజ్‌కుమార్ గారు చెస్ట్ పెయిన్ తో చనిపోవడం ఏంటి అని అందరు షొక్ కి గురయ్యారు. కానీ ఒక మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు అని దేవుడు ఇలా ఫిట్ గా ఉండే మనిషిని తీసుకొని పోయి ప్రజలని రుజువు చేసారు.
డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. అక్టోబర్ 29 మధ్యాహ్నం పునీత్ రాజ్‌కుమార్ గారు మరణించారు. కాసేపటి క్రితమే హాస్పిటల్ కి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై , పునీత్ అన్నయ , నటుడు శివరాజ్‌కుమార్ , యష్‌లు చేరారు. వారి సమక్షంలోనే పునీత్ గారు ఇక లేరు అనే వార్త బయటకు వచ్చింది.
ఈరోజు ఉదయం కూడా భజరంగి సినిమా టీం కి విషెస్ కూడా చెప్పారు. సడన్ గా ఇలా జరిగిపోవడం చాల బాధాకరం.
మా Teluguvision టీమ్ తరుపున పునీత్ గారి కుటుంబానికి మరియు అభిమానులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.