technology information

ఆగష్టు 6 నుంచి భారత్ లో అందుబాటులోకి రానున్న శామ్ సంగ్ గెలాక్సీ On8

 

సౌత్ కొరియాకి చెందిన శామ్ సంగ్ అతితక్కువ కాలoలోనే స్మార్ట్ ఫోన్స్ ప్రపంచలో యాపిల్ కి ధీటుగా గట్టి పోటినిచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది. గత బుధవారం భారతదేశంలో, ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అదే శామ్ సంగ్  గెలాక్సీ On8. ఇది On6 లాగానే ఒక ప్రత్యేకమైన ఆన్ లైన్ ప్రోడక్ట్ , మరియు ఇది కేవలం  ఫ్లిప్ కార్ట్  మరియు శామ్ సంగ్ ఆన్ లైన్ షాప్ (shop.samsung.com/) లో మాత్రమే ఆగష్టు 6 వ తేది నుండి అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర Rs 16,990. గెలాక్సీ On8 ఒక పెద్ద 6-అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ డిస్ ప్లే మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరాతో సెటప్ చేయబడి ఉంటుంది. శామ్ సంగ్ ఈ న్యూ గెలాక్సీ On8 తో  Xiaomi Redmi నోట్ 5 ప్రో, Moto G6, మరియు ఆసుస్ ZenFone మాక్స్ ప్రో M1 వంటి ఇతర ఒకేవిధమైన బడ్జెట్ ఫోన్స్ కి పోటీగా దీనిని మార్కెట్ లో లాంచ్ చేసింది.

కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ On8 పాలికార్బోనేట్ యూనిబాడీ డిజైన్ తో మరియు 18.5: 9 తో ఒక యాస్పెక్ట్ రేషియోతో 6 అంగుళాల HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ డిస్ ప్లే ని కలిగి ఉంది. వెనుక ప్యానెల్ లో ప్రైమరీ కెమెరా f / 1.7 అపేర్చ్యుర్ తో 16-మెగాపిక్సెల్ సెన్సార్ ని కలిగి ఉంటుంది, సెకండరీ కామ్ f / 1.9 ఎపర్చరుతో జత చేయబడిన 5-మెగాపిక్సెల్ సెన్సార్ ని కలిగి ఉంటుంది. ముందు వైపు కొత్త గెలాక్సీ On8 ఒక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కలిగి ఉంటుంది.

గెలాక్సీ On8 యొక్క డ్యూయల్ కెమెరాలు శామ్ సంగ్ ఫ్లాగ్ షిప్ ‘లైవ్ ఫోకస్’ ఫీచర్ తో  ప్యాక్ చేయబడతాయి, దీనితో వినియోగదారులు బ్యాక్ గ్రౌండ్ బ్లర్ గా ఉన్నప్పుడు కూడా ముందువైపు షార్ప్ ఫోకస్ ఉంచి మంచి క్వాలిటీ షాట్లను క్లిక్ చేయగలరు. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ బ్లర్ షేప్, పోర్ట్రైట్ డాలీ, మరియు పోర్ట్రైట్ బ్యాక్ డ్రాప్ వంటి కొన్ని కొత్త డ్యూయల్ కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 450 ప్రాసెసర్, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 256 జీబి వరకు ఎక్స్పండ్ చేసుకునే ఈ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ ముందు వైపు, లేటెస్ట్ Android Oreo 8.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తుంది. ఇది 3,500 mAh బ్యాటరీతో ఉంటుంది.

శామ్ సంగ్ మేక్ ఫర్ ఇండియా, చాట్ ఓవర్ వీడియో ఫీచర్స్ ను గెలాక్సీ On8 యొక్క ఇన్ఫినిటీ డిస్ ప్లే మెరుగుపరిచి వినియోగదారులు చాటింగ్ చేస్తున్నప్పుడు నిరంతరాయంగా మరియు రాజీలేని వీడియో వీక్షణ అనుభవాన్ని కలిగి ఉంటారు, తద్వారా వీడియో చూడడానికి లేదా చాటింగ్ కి మధ్య ఎలాంటి అవసరం లేకుండా చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ శామ్ సంగ్ మాల్ తో ముందుగా లోడ్ చేయబడి ఉంటుంది, ఇది వినియోగదారులకి కావలసిన ప్రోడక్ట్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు మరియు ఆటోమేటిక్ గా ఆ ప్రోడక్ట్ గురించిన రిజల్ట్స్ ని పాపులర్ అయిన ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా పొందవచ్చు.

ఈ గెలాక్సీ ఆన్8 ఒక ప్రత్యేకమైన ఆన్ లైన్ ప్రోడక్ట్ గా లాంచ్ చేయబడింది. ఆగష్టు 6 నుండి ఫ్లిప్ కార్ట్, శామ్ సంగ్ ఈ-స్టోర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. “శామ్ సంగ్ గెలాక్సీ On సిరీస్ నుండి ఒక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది.  నాణ్యత మరియు నమ్మకమైన బ్రాండ్ ఈక్విటీ, గెలాక్సీ On8 భారతదేశం యొక్క ఆన్లైన్ వినియోగదారులకు వారి స్మార్ట్ ఫోన్స్ నుండి మరింత కొత్త దనాన్ని కోరుకునే వారికి ఆ కోరికను తీరుస్తుంది, అని  అయ్యప్పన్ రాజగోపాల్ సీనియర్ డైరెక్టర్, ఫ్లిప్ కార్ట్ మొబైల్స్. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఫ్లిప్ కార్ట్ శామ్ సంగ్ గెలాక్సీ On 8 ని కొనాలి అనుకునే వినియోగదారులకు నో కాస్ట్ EMI, ప్రత్యేక డేటా ఆఫర్లు మరియు మరిన్ని అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.

మరి ఆలస్యమెందుకు ఆగష్టు 6 వ తేది వస్తున్నా ఈ న్యూ బడ్జెట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ ఇవ్వండి, ట్రై చేయండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button