Tollywood news in telugu
మనసున్న మహారాజు! సంపూర్ణేష్ బాబు

sampurnesh babu : హైదరాబాద్ లో వరదలలో తల్లడిల్లుతున్న బాధితులకు తన వంతు 50 వేయిల సహాయాన్ని సంపూర్ణేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.
ఈ రిలీఫ్ ఫండ్ ని మంత్రి హరీష్ రావు కి అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వరదలతో అతలాకుతలం అవుతున్నవేళ సంపూర్ణేష్ బాబు తనకు తోచిన సహాయాన్ని అందించి తాను సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. అని మంత్రి హరీష్ గారు సంపూర్ణేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు చిరంజీవి,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్ లు కోటి విరాళాలు బాధితులకోసం అందజేశారు.